Inner Waves

Tuesday, September 05, 2017

Veluthunna Veluthunna

మాతృ భాష తెలుగు అయినా.. తెలుగు లో అనర్గళంగా మాట్లాడగలిగినా.. కొన్ని కొన్ని భావాలని వ్యక్తపరచాలి అంటే మాటలు కదలవు. ఎలాంటి భావాల్ని అయినా సరళమైన పదములతో పాట రూపంలో అందరి నోటా పాడించే "చంద్రబోస్" గారి కలం నుండి జాలువారిన ఆణిముత్యాలలో ఒకటి...

"వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా

వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
నా మనసు నీనీడలో వదిలేసి వెళుతున్నా...
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న

వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవనీ
ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ
ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ
ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ
జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా

వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న
నీలోన దాగున్న నాకోసం వస్తున్న
నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న

ఆణువణువణువున ఎగసిన అలలను నేడే గమనిస్తున్న
ఆ అలలను కలలుగ మలిచిన మహిమే నీదని గుర్తిస్తున్న
కలలకు వెల్లువ రప్పించి ఊహకు ఉప్పెన అందించి
ఆశల అలజడి పుట్టించి అన్నింటిని ప్రేమకు జత చేసి
నీ మది నది చేరగా కడలిని నేనై కదిలోస్తున్న

నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న"

Labels:

0 Comments:

Post a Comment

<< Home